విడుదలకు ముందే రికార్డు సెట్ చేసిన ప్రదీప్ సినిమా.!

విడుదలకు ముందే రికార్డు సెట్ చేసిన ప్రదీప్ సినిమా.!

Published on Aug 16, 2020 1:47 PM IST

తెలుగు స్మాల్ స్క్రీన్ పై మంచి క్రేజ్ ఉన్న నటుడు ప్రదీప్ మాచిరాజు. ఓ పక్క స్మాల్ స్క్రీన్ పై షోలు చేయడమే కాకుండా పలు చిత్రాల్లో కనిపించిన ఈ యువ నటుడు హీరోగా చేసిన తన మొదటి చిత్రం “30 రోజుల్లో ప్రేమించడం ఎలా?”. నూతన దర్శకుడు మున్నా తెరకెక్కించిన ఈ చిత్రంలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించింది. అయితే ఈ చిత్రం కూడా ఇప్పటికే ఆగిన ఎన్నో చిత్రాల జాబితాలోనే ఉంది.

కానీ ఇంకా విడుదలకు ముందే మన దక్షిణాదిలోనే ఏ చిత్రం కూడా అందుకోని రికార్డును అందుకున్నట్టు దర్శకుడు మున్నాయే తెలిపారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ చిత్రంలో సూపర్ హిట్ ట్రాక్ “నీలి నీలి ఆకాశం” సాంగ్ కోసం మ్యూజిక్ లవర్స్ కు కొత్తగా పరిచయం చెయ్యక్కర్లేదు.

ఈ సాంగ్ ను యూట్యూబ్ లో విడుదల చెయ్యగా ఈ సాంగ్ కు ఇప్పుడు ఏకంగా 200 మిలియన్ వ్యూస్ వచ్చాయట. దీనితో దర్శకుడు ప్రదీప్ కు హీరోయిన్ అమృతకు అలాగే ముఖ్యంగా ఇంత మంచి సాంగ్ ఇచ్చిన రచయిత చంద్రబోస్ కు అలాగే ట్యూన్ ఇచ్చిన అనూప్ కు మరియు సాంగ్ పాడిన సిద్ శ్రీరామ్ కు స్పెషల్ థాంక్స్ తెలిపారు.

తాజా వార్తలు