మరోసారి “ముక్కాలా ముకాబులా”” అనబోతున్న ప్రభుదేవా

మరోసారి “ముక్కాలా ముకాబులా”” అనబోతున్న ప్రభుదేవా

Published on Dec 25, 2012 1:20 AM IST

Prabhu_Deva_does
” ప్రేమికుడు” చిత్రంలో “ముక్కాలా ముకాబులా” అని ఉర్రూతలూగించిన ప్రభుదేవా అదే పాటతో మరోసారి మన ముందుకి రానున్నారు. బాలివుడ్ లో త్వరలో రానున్న “ఎనిబడి కెన్ డాన్స్(ABCD)” అనే చిత్రంలో ఈ పాటకు ప్రభుదేవా డాన్స్ చెయ్యనున్నారు. ప్రభు దేవా మరియు నగ్మాల మీద చిత్రీకరించిన ఈ పాటతో ప్రభుదేవను మైఖేల్ జాక్సన్ తో పోల్చారు. భారతదేశంలో రానున్న మొదటి 3D డాన్స్ ఫిలిం గా ABCD నిలవనుంది. హాలివుడ్ లో వచ్చిన స్టెప్ అప్ సిరీస్ చిత్రాలను పోలి ఈ చిత్రం ఉండబోతుంది అని చెబుతున్నారు. ఈ చిత్రానికి రెమో డిసౌజా దర్శకత్వం వహించగా యుటివి మోషన్ పిక్చర్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు ఈ చిత్రంలో గణేష్ ఆచార్య, కేకే మీనన్ వంటి వారు కూడా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సచిన్ జిగార్ సంగీతం అందిస్తుండగా ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 8,2013న విడుదల చెయ్యనున్నారు.

తాజా వార్తలు