సంక్రాంతి బరిలో ప్రభాస్

సంక్రాంతి బరిలో ప్రభాస్

Published on Oct 11, 2012 3:15 PM IST


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘వారధి’ సినిమా 2013 సంక్రాంతి బరిలో చేరింది. ఈ చిత్రాన్ని జనవరి 11న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర చిత్రీకరణ ప్రస్తుతం ఇటలీలో జరుగుతోందని ఇదివరకే తెలియజేశాం. అది పూర్తయిన తర్వాత ఈ నెల 19 నుంచి ఇండియాలో షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్ తో ఈ చిత్ర చిత్రీకరణ పూర్తవుతుంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన అనుష్క మరియు రిచా గంగోపాధ్యాయ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘వారధి’ అనేది వర్కింగ్ టైటిల్ మాత్రమే ఖరారైన టైటిల్ కాదు.

యు.వి క్రియేషన్స్ బ్యానర్ పై ప్రమోద్ ఉప్పలపాటి మరియు వంశీ కృష్ణ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా మాటల రచయిత కొరటాల శివ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ అని మరియు ప్రభాస్ సరికొత్త స్టైలిష్ లుక్ తో కనపడనున్నాడని అంచనా వేస్తున్నారు.

తాజా వార్తలు