ఫ్యాన్స్ తో మిర్చి మూవీ చూస్తున్న ప్రభాస్

ఫ్యాన్స్ తో మిర్చి మూవీ చూస్తున్న ప్రభాస్

Published on Feb 13, 2013 10:45 AM IST

prabhas

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘మిర్చి’ సినిమా సక్సెస్ తో ఫుల్ హ్యాపీగా ఉన్నాడు, అలాగే ఈ సినిమా ప్రభాస్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. దాంతో ప్రభాస్ ఈ సినిమాని మరోసారి చూడాలనుకున్నాడు, అది కూడా తనని ఎంతో అభిమానించే అభిమానులతో కలిసి చూడాలని నిర్ణయించుకున్నాడు. ప్రభాస్ ఈ రోజు సంధ్య 35 ఎం.ఎం లో ఫ్యాన్స్ తో కలిసి మార్నింగ్ షో చూస్తున్నారు. ఈ షో పూర్తయిన తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ తో ముచ్చటించనున్నారు.

ప్రభాస్ స్టార్ పవర్, గ్లామర్ ఈ సినిమా ఇంత పెద్ద విజయం సాధించడానికి గల కారణమని ట్రేడ్ పండితులు అంటున్నారు. అనుష్క, రిచా గంగోపాధ్యాయ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. ప్రమోద్ – వంశీ నిర్మించిన ఈ సినిమాకి కొరటాల శివ డైరెక్టర్

తాజా వార్తలు