టాలీవుడ్లో తెరకెక్కిన ప్రెస్టీజియస్ మూవీ ‘కన్నప్ప’ ఇప్పటికే సినీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేయగా హీరో విష్ణు మంచు లీడ్ రోల్లో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు పెరిగేలా చేశాయి.
ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ నటిస్తుండటంతో ఈ సినిమాలో వారి పాత్రలు ఎలా ఉండబోతున్నాయా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తుండటంతో ఈ సినిమాలో ఆయన పాత్రపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఇప్పుడు ‘కన్నప్ప’ సినిమా కోసం ప్రభాస్ ప్రమోషన్స్ కూడా చేసేందుకు రెడీ అవుతున్నాడట.
‘కన్నప్ప’కు సంబంధించిన తెలుగు ప్రమోషన్స్‌ను హైదరాబాద్‌లో నిర్వహించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. ఈ ఈవెంట్‌కు ప్రభాస్‌ను కూడా పిలవాలని వారు భావిస్తున్నారట. దీంతో కన్నప్ప చిత్రానికి మంచి మైలేజీ వస్తుందని వారు భావిస్తున్నారట. మరి నిజంగానే ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ప్రభాస్ వస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది.