రాజమౌళి తీస్తున్న బాహుబలి షూటింగ్ నుంచి యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ చిన్న విరామం తీసుకుంటున్నాడు. భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్న యుద్దపు సన్నివేశంలో ప్రభాస్ గతకొన్ని నెలలుగా ప్రభాస్ నటిస్తూనే వున్నాడు
అలుపెరుగని షెడ్యూల్ లో నటించిన ఈ ఆరడుగుల హీరో కాసింత విరామం తీసుకుందామని నిర్ణయించుకున్నాడు. ఒకటి రెండు రోజులలో తిరిగి షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమా 2015లో విడుదల కానుంది
రానా, అనుష్క, తమన్నా వంటి ప్రముఖులు ఈ సినిమాలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతదర్శకుడు. సెంథిల్ సినిమాటోగ్రాఫర్. ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ ని ఆర్కా మీడియా సంస్థ నిర్మిస్తుంది