బాహుబలి తరువాత ప్రభాస్ ఇక పెద్ద చిత్రాలకే పరిమితమైనట్లున్నాడు. గత ఏడాది 350కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిన సాహో అనే యాక్షన్ ఎంటర్టైనర్ లో నటించారు. ఆ చిత్రం మిశ్రమ ఫలితాలు అందుకుంది. అనూహ్యంగా తెలుగులో కంటే సాహో హిందీలో మంచి ఆదరణ దక్కించుకుంది. అక్కడ దాదాపు హిందీ వెర్షన్ 150 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. దీనితో ప్రభాస్ ప్రతి సినిమాలో హిందీలో విడుదల చేయనున్నారు.
ప్రస్తుతం భారీ పీరియడ్ లవ్ స్టోరీలో నటిస్తున్న ప్రభాస్ దర్శకుడు నాగ్ అశ్విన్ తో మరో మూవీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ మూవీ వచ్చే ఏడాది ఆఖర్లో విడుదల కానుంది. కాగా ఈ చిత్రం కోసం ప్రభాస్ ఫుల్ మేక్ ఓవర్ కానున్నాడట. సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సూపర్ హీరోగా కనిపించనున్నాడని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఫిజికల్ గా భారీగా కనిపించడం కోసం నిపుణుల సమక్షంలో శిక్షణ తీసుకుంటాడట. రాధా కృష్ణ మూవీ షూటింగ్ అనంతరం జిమ్ లో కసరత్తులు మొదలుపెడతాడట. ఇక ఈ చిత్రాన్ని సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ నిర్మిస్తున్నారు.