పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఐకానిక్ హిట్ చిత్రం బాహుబలి నేటితో పదేళ్లు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. మరి ఈ సమయంలో అభిమానులు సహా చిత్ర యూనిట్ కూడా ఈ స్పెషల్ డేకి మరోసారి పాత రోజుల్లోకి వెళ్లారు. అయితే ఈ ముచ్చట ఓ పక్క నడుస్తుంటే లేటెస్ట్ గా ది రాజా సాబ్ సర్ప్రైజ్ ఇచ్చాడు.
దర్శకుడు మారుతితో ప్రభాస్ చేస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ లో మారుతీ స్నేహితుడు, మన టాలీవుడ్ మాస్ ప్రొడ్యూసర్ ఎస్ కే ఎన్ మొదటి నుంచీ ప్రయాణం చేస్తున్న సంగతి తెలిసిందే. మరి మొన్నామధ్య రాజా సాబ్ టీజర్ లాంచ్ లో ఎస్ కే ఎన్ స్పీచ్ కూడా హైలైట్ అయ్యింది. మరి ఈ బాహుబలి బిగ్ డే నాడు ఎస్ కే ఎన్ నేరుగా సినిమా సెట్స్ నుంచి షేర్ చేసుకున్న పిక్ వైరల్ గా మారింది.
ఇందులో ఎస్ కే ఎన్ తో కలిసి కనిపించిన ప్రభాస్ మంచి స్టైలిష్ గా క్లాస్ లుక్ లో కనిపిస్తున్నాడని చెప్పాలి. సింగిల్ బటన్ పెట్టి షర్ట్ ని అలా ఫ్రీగా వదిలేసి కళ్లద్దాలుతో కూల్ గా వింటేజ్ ప్రభాస్ ని తలపించాడు. మరి దీనిని మించిన బర్త్ డే మూమెంట్ ఇంకొకటి ఉండదు అని అలాగే ఇదే ఇప్పుడు జరుగుతున్న షూట్ సన్నివేశాలు మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తాయి రాసిపెట్టుకోండి అనే రేంజ్ లో ఎస్ కే ఎన్ చెబుతున్నారు. దీనితో ఈ పిక్ మంచి వైరల్ గా మారింది.