ఇది మీకు తెలుసా? క్లాసిక్ ’96’ సినిమా మొదటి ప్లాన్ విజయ్ తో కాదట!

భాషతో సంబంధం లేకుండా కేవలం ఎమోషన్ తోనే కనెక్ట్ అయ్యిన ఎన్నో సినిమాల్లో కోలీవుడ్ హిట్ చిత్రం 96 కూడా ఒకటి. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, త్రిష హీరో హీరోయిన్స్ గా దర్శకుడు ప్రేమ్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పటికీ క్లాసిక్ గా నిలిచింది. ఆడియెన్స్ లో మంచి స్థానం సంపాదించుకున్న ఈ సినిమాని తెలుగులో శర్వానంద్, సమంతలు జానుగా రీమేక్ కూడా చేశారు.

అయితే ఈ సినిమా ఒరిజినల్ గా అసలు విజయ్ సేతుపతి, త్రిష లతో ప్లాన్ చేసిందే కాదట. ఇంకా చెప్పాలంటే అసలు దర్శకుడు తమిళ్ లోనే ఈ సినిమా చేయాలని అనుకోలేదట. తాను హిందీలో మొదట చేసేందుకు కథ రాసుకున్నారట. హిందీలో జూనియర్ అమితాబ్ అభిషేక్ బచ్చన్ తో ఈ సినిమా చేయాలని ప్లాన్ చేసుకుంటే అప్పుడు సమయంలో అభిషేక్ ని ఎలా సంప్రదించాలో తెలీక సాధ్యపడక తమిళ్ లో వీరితో చేశారట. మరి ఒకవేళ అభిషేక్ కే ఈ సినిమా పడి ఉంటే బాలీవుడ్ ఆడియెన్స్ కి తన నుంచి మరో ఐకానిక్ సినిమాగా నిలిచి ఉండొచ్చు. కానీ తన బ్యాడ్ లక్.

Exit mobile version