మరో సాలిడ్ ప్రాజెక్ట్ తో వస్తున్న ధనుష్.. ఆసక్తి రేపుతున్న పోస్టర్!

కోలీవుడ్ వెర్సటైల్ స్టార్ హీరో ధనుష్ హీరోగా నటించిన హిట్ చిత్రం “కుబేర”తో తన హిట్ స్ట్రీక్ ని అలా కొనసాగిస్తున్నాడని చెప్పాలి. ఇక ఈ సినిమా తర్వాత ధనుష్ నుంచి మరిన్ని ఆసక్తికర ప్రాజెక్ట్ లు రాబోతుండగా వాటిలో లేటెస్ట్ గా మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ అయ్యింది. ధనుష్ కెరీర్లో 54వ సినిమాగా దర్శకుడు విగ్నేష్ రాజాతో అనౌన్స్ అయ్యింది. అయితే ఈ సినిమాపై విడుదల చేసిన పోస్టర్ ఆసక్తి రేపుతోంది అని చెప్పాలి.

ఇందులో ధనుష్ నిలబడి దిగాలుగా కనిపిస్తుండగా తన పత్తి పంట కాలిపోతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. దీనితో ఈ సినిమాలో ధనుష్ ఒక రైతుగా కనిపిస్తాడని అనిపిస్తుంది. మొత్తానికి మాత్రం ధనుష్ మరో సాలిడ్ రూరల్ ఎమోషనల్ డ్రామాతో రాబోతున్నాడని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి జీవి ప్రకాష్ సంగీతం అందిస్తుండగా వేల్స్ ఫిల్మ్స్ ఎంటర్టైన్మెంట్స్ అలాగే థింక్ స్టూడియోస్ వారు నిర్మాణం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టుకుంది.

Exit mobile version