అఫీషియల్: ‘ది ప్యారడైజ్’ వరల్డ్ లోకి ‘కిల్’ విలన్

నాచురల్ స్టార్ నాని హీరోగా ఇప్పుడు వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో దూసుకెళుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా హిట్ 3 తో అదరగొట్టిన నాని ఈ సినిమా తర్వాత దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో పాన్ వరల్డ్ లెవెల్లో అనౌన్స్ చేశారు. ఇక ఈ చిత్రంపై పలు రూమర్స్ తర్వాత ఎట్టకేలకి షూటింగ్ ని క్రేజీ లెవెల్లో స్టార్ట్ చేసారు.

అయితే గత కొన్నాళ్ల నుంచి ది ప్యారడైజ్ లో బాలీవుడ్ సెన్సేషనల్ చిత్రం ‘కిల్’ విలన్ నటుడు రాఘవ్ జుయల్ కూడా ఉన్నాడని రూమర్స్ వచ్చాయి. మరి నేడు దీనిపై మేకర్స్ ఓ క్రేజీ మేకింగ్ వీడియోతో అనౌన్స్ చేసేసారు. ఈ టాలెంటెడ్ యంగ్ నటుణ్ని తెలుగు సినిమాకి ఒక కొత్త లుక్ లో కొత్త పాత్రలో పరిచయం చేస్తూ తమ ప్యారడైజ్ వరల్డ్ లోకి ఆహ్వానించారు..

నేడు ఈ యువ నటుడు పుట్టినరోజు సందర్భంగా అనౌన్స్ చేసిన ఈ స్పెషల్ వీడియో అభిమానులని మరింత ఎగ్జైట్ చేస్తూ మరిన్ని అంచనాలు పెంచింది. ఇక ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తుండగా ఎస్ ఎల్ వి సినిమాస్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version