ఈ అప్డేట్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ అప్పుడే పడిగాపులు!

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న “రాధే శ్యామ్” ఇటలీలో షూట్ జరుపుకుంటుంది. ఈ కెన్నీ రోజుల్లోనే ప్రభాస్ పుట్టినరోజు వస్తుండడంతో రాధే శ్యామ్ టీజర్/మోషన్ పోస్టర్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్ కంటే ముందు మాత్రం మార్ అప్డేట్ కోసం ప్రభాస్ అభిమానులు మరింత ఆసక్తి కనబరుస్తున్నారు.

అదే ప్రభాస్ మరియు నాగశ్విన్ ల ప్రాజెక్ట్ కోసం. ఈ చిత్రానికి సంబంధించి ప్రభాస్ పుట్టినరోజుకు అయితే ఎలాంటి అప్డేట్ లేదు కానీ అంతకు ముందు గానే ఒక కిల్లర్ అప్డేట్ ఉందని నాగశ్విన్ చెప్పడంతో డార్లింగ్ ఫ్యాన్స్ అటెన్షన్ అంతా ఒక్కసారిగా అటువైపు మళ్లింది. దీనితో ఆ అప్డేట్ ఏమై ఉంటుంది.

ఇంకా ప్రభాస్ పుట్టినరోజు కంటే ముందే అంటే ఎప్పుడు వస్తుందా అని ఇప్పటి నుంచే పడిగాపులు కాస్తున్నారు. ప్రభాస్ పుట్టినరోజు కన్నా ముందే అంటే అది ఖచ్చితంగా ప్రభాస్ పై ఉన్నది కాదు. అంటే సినిమాలో ఇతర క్యాస్టింగ్ కానీ లేదా కేవలం సినిమాకు రిలేటెడ్ గా ఏదన్నా సమాచారాన్ని అందివ్వచ్చు.

మరి అశ్విన్ ఏం తెలపనున్నారో తెలియాలి అంటే డార్లింగ్ అభిమానులు ఇంకొన్ని రోజులు ఓపిక పట్టక తప్పదు. స్కై ఫై థ్రిల్లర్ గా నాగశ్విన్ తెరకెక్కిస్తున్నా ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె ఫీమేల్ లీడ్ చేస్తుండగా లెజెండరీ నిర్మాత అశ్వనీ దత్ 500 కోట్ల మేర భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Exit mobile version