యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో “సలార్” అనే భారీ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రాన్ని పూర్తిగా ఒక సరికొత్త కథగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. మరి తగ్గట్టుగానే భారీ హంగులతో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో పలు ఆసక్తికర గాసిప్పులే వినిపిస్తున్నాయి.
అలా ఇప్పుడు మరి ఇంట్రెస్టింగ్ గాసిప్ వచ్చింది. అదే ఈ సినిమాలో ఓ స్టార్ హీరోయిన్ తో స్పెషల్ సాంగ్ చేయిస్తున్నారని. మరి అది కూడా మరెవరో కాదు ప్రభాస్ చేయబోయే మరో భారీ ప్రాజెక్ట్ నాగ్ అశ్విన్ తో చేస్తున్న సినిమా హీరోయిన్ దీపికా పదుకొనె అనే టాక్. మరి ఇది ఎంత వరకు నిజమో కానీ ఆ టాక్ ఇప్పుడు వైరల్ అవుతుంది. మరి ఈ టాపిక్ లో నిజం ఎంత ఉందో కాలమే నిర్ణయించాలి.