పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘హరిహర వీరమల్లు’ కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను క్రిష్, జ్యోతికృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర పవర్‌ఫుల్‌గా ఉండబోతుందని ఇప్పటికే రిలీజ్ అయిన చిత్ర ప్రమోషనల్ కంటెంట్ చూస్తే అర్థమవుతుంది.
అయితే, ఈ సినిమా హిస్టారికల్ డ్రామాగా మేకర్స్ రూపొందించారు. మొఘల్ సామ్రాజ్యాన్ని గడగడలాడించే వీరుడిగా వీరమల్లు కనిపించనున్నాడు. అయితే, మొఘల్ రాజులకు నిద్ర లేకుండా చేసిన వీరమల్లు లుక్ ఇదేనంటూ ఓ పవర్‌ఫుల్ పిక్‌ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో పవన్ కళ్యాణ్ పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్నాడు.
ఆయనలోని ఛార్మ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని వారు ఆసక్తిగా ఉన్నారు. కాగా, ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా బాబీ డియోల్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఎ.ఎం.రత్నం ప్రొడ్యూస్ చేస్తున్నారు.