మంచు మనోజ్ కుమార్ నటించిన ‘పోటుగాడు’ చిత్రం సెన్సార్ పనులు పూర్తిచేసుకుని ‘ఏ’ సర్టిఫికేట్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాకు పవన్ వాడేయార్ దర్శకుడు. రామలక్ష్మి సినీ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మాణమవుతుంది.
‘పోటుగాడు’ సినిమా సెప్టెంబర్ 13నా ప్రేక్షకులముందుకు రానుంది. ఇటీవలే విడుదలైన ఆడియో మంచి స్పందనను అందుకుంది.సిమ్రాన్ కౌర్, సాక్షి మరియు అను ప్రియా ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్లో హీరోయిన్స్. ఈ సినిమా కన్నడలో ఘనవిజయం సాధించిన ‘గోవిందాయనమః’ కు రీమేక్. .