టిప్పు సుల్తాన్ గా పోసాని

టిప్పు సుల్తాన్ గా పోసాని

Published on Oct 11, 2012 1:00 AM IST


ఎప్పుడు ఎలాంటి పాత్రతో ప్రేక్షకుల ముందుకి వస్తారో చెప్పలేని ఒక నటుడు పోసాని కృష్ణ మురళి. ప్రస్తుతం ఈయన టిప్పు సుల్తాన్ గా కనిపించనున్నారు. అవునండీ టిప్పు సుల్తాన్ అంటే కత్తి పట్టుకొని కిరీటం పెట్టుకొని పాతకాలం రాజులా ఉంటారు అనుకునేరు విష్యం ఏంటంటే “కృష్ణం వందే జగద్గురుం” లో టిప్పు సుల్తాన్ అనే పాత్రలో పోసాని కనిపించనున్నారు. ఈ చిత్రంలో పోసాని పాత్ర చిత్ర పూర్తి నిడివి ఉండటమే కాకుండా కీలక పాత్రగా ఉండనుంది. ఈ చిత్రం నవంబర్లో విడుదలకు సిద్దమయ్యింది. రానా మరియు నయనతారలు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించారు. మణిశర్మ సంగీతం అందించారు ఈ చిత్ర ట్రైలర్ ఇప్పటికే జనంలో అంచనాలను భారీగా పెంచేశాయి. రాజీవ్ రెడ్డి మరియు సాయి జాగర్లమూడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు