పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా చాలా రోజుల క్రితం ఆయన రేడియో మిర్చికి ఇచ్చిన ఇంటర్వ్యూలో తను డైరెక్ట్ చేసిన ‘జానీ’ సినిమా గురించి కొన్ని ఆసక్తి కరమైన విషయాలను తెలిపాడు. 2003లో వచ్చిన ఈ సినిమాలో ఫైట్స్ ని చాలా స్టైలిష్ గా చూపించారని అందరూ మెచ్చుకున్నా బాక్స్ ఆఫీసు వద్ద మాత్రం విజయాన్ని అందుకోలేకపోయింది.
ఈ సినిమా పరాజయానికి కారణం ఏమిటా అని అడిగితే? ‘ స్క్రీన్ ప్లే నే ప్రధాన కారణం. నేను అనుకున్న దాని పర్ఫెక్ట్ గా చెప్పడానికి నాకు ఓ మంచి రైటర్స్ టీం కావాలి. నాకు రైటింగ్ టాలెంట్ తక్కువ, అలాగే రైటింగ్ నుంచి మంచి సపోర్ట్ లేదు. దాని వల్ల జానీ చాలా ఫ్లాట్ గా అనిపిస్తుంది. జానీ మూవీకి ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే లేదని’ పవన్ కళ్యాణ్ అన్నాడు.
మళ్ళీ డైరెక్షన్ చేస్తారా అని అడిగితే ‘ నేని ఇది వరకే చెప్పినట్టు మంచి రైటర్స్ టీం దొరికితే, ఆడియన్స్ కి చెప్పడానికి మంచి కథ దొరికి, దానికి మంచి పర్ఫెక్ట్ రైటింగ్ కుదిరిందని నాకు నమ్మకం కుదిరితే భవిషత్తులో డైరెక్ట్ చేస్తాను. కానీ నా నుండి వచ్చిన కథలని మాత్రమే నేను డైరెక్ట్ చేస్తాను. నేను డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవడానికి ఎవరో బయటి వారి కథతో సినిమా చెయ్యను. బయటి వారి కథలకి నేను న్యాయం చెయ్యలేను. నాకు నేనుగా కథని ఫీల్ అవ్వాలి, నాకు నమ్మకం ఉండాలని’ పవన్ అన్నాడు.
ఈ ఇంటర్వ్యూ చాలా కాలం క్రితమే తీసుకున్నప్పటికీ నిన్న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా మళ్ళీ రేడియో స్టేషన్ లో ప్లే చేసారు.