పిక్ టాక్: ‘అఖండ 2’ మిక్సింగ్ తర్వాత థమన్, బోయపాటి మాస్ స్టిల్

పిక్ టాక్: ‘అఖండ 2’ మిక్సింగ్ తర్వాత థమన్, బోయపాటి మాస్ స్టిల్

Published on Dec 3, 2025 10:22 AM IST

Akhana 2

ప్రస్తుతం తెలుగు ఆడియెన్స్ ఎంతో ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న సినిమా ఏదన్నా ఉంది అంటే అది ‘అఖండ 2’ అనే చెప్పాలి. నటసింహం బాలకృష్ణ దర్శకుడు బోయపాటి శ్రీను కలయికలో తెరకెక్కించిన ఈ సాలిడ్ యాక్షన్ అండ్ డివోషనల్ సినిమా ఇంకొన్ని గంటల్లో థియేటర్స్ లో పడనుంది. ఇక ఈ సినిమాకి సంగీత దర్శకుడు థమన్ వర్క్ కూడా గట్టి అంచనాలు ఉన్నాయి.

నిజానికి పార్ట్ 1 ఆ రేంజ్ లో హిట్ కావడానికి గల కారణాల్లో థమన్ కి చాలా పెద్ద పాత్ర. అందుకే ఈసారి పార్ట్ 2 లో వర్క్ పై కూడా నెక్స్ట్ లెవెల్ హైప్ ఉంది. ఇక అందుకు తగ్గట్టుగానే మేకర్స్ కూడా సాలిడ్ వర్క్ ని ఇపుడు కంప్లీట్ చేసినట్టు తెలిపారు. థమన్ తన టీం అండ్ దర్శకుడుతో కలిసి తన స్టూడియోలో దిగిన పిక్స్ తో ఈసారి అఖండ తాండవం మరింత గట్టిగా ఉంటుంది అని అంతా ఆ శివుని ట్రాన్స్ లోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి అంటూ తెలిపాడు.

ఇక ఇందులో దర్శకుడు బోయపాటితో దిగిన పిక్ అయితే తమ కాన్ఫిడెన్స్ ఏ లెవెల్లో ఉందో చూపిస్తుంది. ఒక బ్లాక్ బస్టర్ ని డెలివర్ చేస్తున్నాం అనే రేంజ్ లో తాము ఇద్దరు మాస్ స్టిల్ ఇచ్చారు. ఇక ఈ సినిమా ఎలా ఉంటుందో రేపటితో తేలిపోతుంది. ఇక ఈ సినిమాకి 14 రీల్ ప్లస్ వారు నిర్మాణం వహించగా డిసెంబర్ 5న ఫుల్ ఫ్లెడ్జ్ గా పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.

తాజా వార్తలు