పిక్ టాక్ : ‘తెలుసు కదా’ ముగ్గురు మాంత్రికులు వీళ్లే..!

Telusu-Kada

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘తెలుసు కదా’ దీపావళి కానుకగా గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయింది. ఈ సినిమాను నీరజ కోన డైరెక్ట్ చేస్తుండగా పూర్తి లవ్ స్టోరీ చిత్రంగా ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమవుతోంది.

ఇక ఈ సినిమా కోసం ముగ్గురు మాంత్రికులు తీవ్రంగా శ్రమించారు. ఈ చిత్ర దర్శకురాలు నీరజ కోన ఈ చిత్రానికి కెప్టెన్‌గా ఉండగా, ఆమె చెప్పిందల్లా చేస్తూ హీరో సిద్ధు జొన్నలగడ్డ తనవంతు న్యాయం అందించాడు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ చిత్రానికి అందించిన సంగీతం ఈ సినిమాకు ఆయువుపట్టుగా మారనుందని చిత్ర యూనిట్ చెబుతోంది.

ఈ సినిమా రిలీజ్ దగ్గర పడటంతో ఈ ముగ్గురు కలిసి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇక ఈ సినిమాలో రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టి.జి.విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశారు.

Exit mobile version