ఓటీటీలో దుమ్ములేపుతున్న ‘వార్-2’

war2

బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించిన భారీ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘వార్ 2’ థియేటర్లలో ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే బాక్సాఫీస్ వద్ద కొంత నిరాశ కలిగించిన ఈ చిత్రం ఓటిటీలో మాత్రం సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

ఈ చిత్రాన్ని అక్టోబర్ 9 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో హిందీ, తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఇక తాజాగా ఆర్మాక్స్ రిపోర్ట్ ప్రకారం అక్టోబర్ 6 నుండి 12 వరకు ఇండియాలో అత్యధికంగా వీక్షించబడిన చిత్రంగా ‘వార్ 2’ నిలిచింది. ఈ చిత్రం మొత్తం 3.5 మిలియన్ వ్యూస్ సాధించి దూసుకెళ్లిందని తెలుస్తోంది.

ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్‌గా నటించగా అనిల్ కపూర్, అశుతోష్ రాణా కీలక పాత్రల్లో కనిపించారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆదిత్య చోప్రా తన యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మించారు.

Exit mobile version