రవితేజతో సినిమా పై ‘సిద్ధు జొన్నలగడ్డ’ క్లారిటీ

Siddhu-Jonnalagadda-Ravitej

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నీరజ కోన డైరెక్ట్ చేస్తున్న చిత్రం ‘తెలుసు కదా’. అక్టోబర్ 17, 2025న గ్రాండ్ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా సిద్ధు జొన్నలగడ్డ సినిమా ప్రమోషన్స్ లో ఈ సినిమా గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చాడు. ఈ దీపావళికి పోటీ చాలా ఉంది అనే ప్రశ్నకు.. సిద్దు మాట్లాడుతూ..రిస్క్‌ ఉన్నచోటే విజయం ఉంటుంది. నా గత చిత్రం అనుకున్న స్థాయిలో అలరించలేకపోయింది. ఒక సినిమా నన్ను కింద పడేస్తే.. మరొకటి టాప్‌లో చేర్చుతుందని నమ్ముతాను’ అని సిద్దు చెప్పుకొచ్చాడు.

‘తెలుసు కదా’ చిత్రంలో రొమాన్స్ గురించి మాట్లాడుతూ.. లవ్‌ స్టోరీ కాబట్టి దానికి తగినట్లే తెరకెక్కించాము. కాకపోతే, ఈ సినిమాలో ముద్దు సన్నివేశాలు లేవు. ఒక్క ముద్దు సీన్‌ కూడా ఉండకూడదు అని కథ చెప్పినప్పుడే నీరజకు కండీషన్‌ పెట్టాను. ఇది ఫ్యామిలీ మూవీ’ అని సిద్దు తెలిపాడు. రవితేజ -మీ కలయికలో మల్టీస్టారర్ వచ్చే అవకాశం ఉందా ? అనే ప్రశ్నకు.. సిద్ధూ మాట్లాడుతూ.. నిజానికి మేం గతంలో ఒక సినిమా ప్లాన్‌ చేశాం. కానీ, అది ఆగిపోయింది. ఒకవేళ మా ఇద్దరికీ సరిపోయే కథ ఉంటే కచ్చితంగా సినిమా చేస్తాం’ అని సిద్దు క్లారిటీ ఇచ్చాడు.

Exit mobile version