‘మిత్ర మండలి’ పై పెయిడ్ ట్రోలింగ్.. బన్నీ వాస్ మాస్ వార్నింగ్!

Bunny-Vas

టాలీవుడ్‌లో తెరకెక్కిన లేటెస్ట్ ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘మిత్ర మండలి’ దీపావళి కానుకగా అక్టోబర్ 16న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయింది. ఇప్పటికే ఈ సినిమా ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ క్రియేట్ చేయడంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ హిట్ అందుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

ఇక ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ సందర్భంగా నిర్మాత బన్నీ వాస్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ సినిమాపై నెగిటివ్ ట్రోలింగ్ చేసేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని.. పెయిట్ ట్రోలర్స్‌తో ఈ సినిమాపై దుష్ప్రచారం చేయిస్తున్నారని.. వారు ఏం చేసినా సినిమాలో కంటెంట్ ఉంటే ఎవరూ ఆపలేరని ఆయన తెలిపారు.

దీంతో ఈ సినిమాపై పెయిడ్ ట్రోలింగ్ చేయిస్తుంది ఎవరా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమాలో ప్రియదర్శి, నిహారిక ఎన్ఎమ్, రాగ్ మయూర్, విష్ణు, ప్రసాద్ బెహరా లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు.

Exit mobile version