పిక్ టాక్ : కూతురు అర్హ యోగాసనం.. చూస్తూ కూర్చుండిపోయిన ఐకాన్ స్టార్

జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరుపుకుంటున్నారు. రాజకీయ నాయకులు మొదలుకొని సినిమా స్టార్స్ వరకు అందరూ ఈ యోగా దినోత్సవాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, తెలుగు రాష్ట్రాల్లో ఈ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. ఏపీలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ యోగా దినోత్సవ వేడుకలో పాల్గొన్నారు.

అయితే, ఇలాంటి యోగా దినోత్సవం రోజును అల్లు ఫ్యామిలీ కూడా గ్రాండ్‌గా జరుపుకుంటుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ యోగాసనం చేస్తున్న ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అర్హ యోగా చేస్తుండగా.. తన కూతురు చేస్తున్న యోగాను అల్లు అర్జున్ అలా చూస్తూ కూర్చుండిపోయాడు. అయితే, ఇది పాత ఫోటో అయినప్పటికీ, యోగా డే సందర్భంగా అభిమానులు దీనిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

Exit mobile version