గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పెద్ది’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేస్తుండగా పూర్తి రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ మాస్ లుక్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు.
ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమాపై బజ్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాయి. కాగా, తాజాగా ఈ చిత్ర డీఓపీ రత్నవేలు ఓ ఇంట్రెస్టింగ్ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నైట్ షెడ్యూల్ షూటింగ్‌లో కొన్ని అబ్బురపరిచే ఫైట్ సీన్స్ చిత్రీకరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇక ఈ సీన్స్‌లో చరణ్ ఫైర్ పుట్టిస్తున్నాడని ఆయన కామెంట్ చేశారు.
ఈ ఫోటోలో చరణ్ ఊరమాస్‌గా కనిపిస్తుండటంతో అభిమానుల్లో ఈ సీక్వెన్స్‌పై అప్పుడే అంచనాలు పెరిగిపోతున్నాయి. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.