ఓటిటి లవర్స్ కి పాన్ ఇండియా డల్ వీకెండ్!

ఈ కొన్ని రోజుల్లోనే థియేటర్స్ రిలీజ్ లు లేక ఓటిటి కంటెంట్ రూలింగ్ బాగా ఎక్కువ అయ్యింది. ప్రతీ వారం కూడా పాన్ ఇండియా లెవెల్లో కొత్త కొత్త సినిమాలు సిరీస్ లు దాదాపు నోటెడ్ నటీనటుల నుంచే వస్తున్నాయి కానీ ఈ వీకెండ్ మాత్రం థియేటర్స్ దే పైచేయి అయ్యింది అని చెప్పవచ్చు. థియేటర్స్ లో తెలుగు సహా హిందీ, తమిళ్ లో పలు సినిమాలు సందడి చేస్తున్నాయి.

కానీ వీకెండ్ లో కూల్ గా ఎంజాయ్ చేద్దాం అనుకునే ఓటిటి లవర్స్ కి మాత్రం ఇదొక డల్ వీకెండ్ అని చెప్పక తప్పదు. తెలుగు ఆడియెన్స్ కి అయితే అసలే అని చెప్పాలి. మినిమం నోటెడ్ సినిమాలూ లేవు పెద్ద హీరోస్ నుంచి మిడ్ రేంజ్ హీరోస్ సినిమాలు కూడా ఏ ఓటిటిలో ఈ వీకెండ్ కి కనిపించలేదు. పోనీ డబ్బింగ్ లో చూసుకున్నా హిందీ, ఇంగ్లీష్ లలో అయినా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. దీనితో ఈ వారాంతం మాత్రం ఓటిటి వీక్షకులకు పెద్దగా ఉపయోగం లేదనే అనుకోవాలి.

Exit mobile version