ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తమిళ దర్శకుడు అట్లీ డైరెక్షన్లో ఓ భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుండగానే అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీపై సోషల్ మీడియాలో ఇటీవల పలు వార్తలు చక్కర్లు కొట్టాయి.
అల్లు అర్జున్ త్వరలోనే మలయాళ నటుడు కమ్ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్ డైరెక్షన్లో ఓ సినిమా చేయనున్నాడని.. దీనికి ‘శక్తిమాన్’ అనే టైటిల్ కూడా పెట్టబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. కాగా ఈ వార్తలపై బాసిల్ జోసెఫ్ తాజాగా క్లారిటీ ఇచ్చారు.
‘శక్తిమాన్’ అనే సినిమాను తాను బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ కోసం ప్లాన్ చేశానని.. దానిని తప్పకుండా ఆయనతోనే చేస్తాను అంటూ బాసిల్ మరోసారి క్లారిటీ ఇచ్చాడు. దీంతో శక్తిమాన్ సినిమాలో అల్లు అర్జున్ నటిస్తాడనే వార్తలకు చెక్ పడినట్లు అయింది.