ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రాల్లో మాస్ ఎంటర్టైనర్ చిత్రం “ఉస్తాద్ భగత్ సింగ్” కూడా ఒకటి. తన బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీష్ శంకర్ కలయికలో చేస్తున్న రెండో సినిమా ఇది కాగా పవన్ చాలా కాలం గ్యాప్ తర్వాత శరవేగంగా షూటింగ్ లో పాల్గొంటున్నారు.
అయితే ఈ సినిమా సెట్స్ లోకి పవన్ అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి విజిట్ చేయడం ఇపుడు సర్ప్రైజింగ్ గా మారింది. ఉస్తాద్ సెట్స్ లో విశ్వంభర కనిపించిన ఫ్రేమ్ ఇపుడు సోషల్ మీడియాలో సహా మెగా అభిమానుల్లో వైరల్ గా మారింది. దీనితో ఈ బ్యూటిఫుల్ మూమెంట్ మంచి స్పెషల్ గా మారింది. మరి ఈ మెగా బ్రదర్స్ తో పాటుగా మైత్రి నిర్మాత రవి శంకర్ కూడా కనిపిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది.