గ్లోబల్ స్టార్ తో దిల్ రాజు మళ్లీ.. ఈసారి హిట్ పక్కా

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన రీసెంట్ సినిమా గేమ్ ఛేంజర్ కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా అనుకున్న రీతిలో ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఇక నిర్మాత దిల్ రాజు ఎంతో బడ్జెట్ పెట్టగా రిజల్ట్ మాత్రం భిన్నంగా వచ్చింది. ఇంత అయినప్పటికీ దిల్ రాజు రామ్ చరణ్ తో మరో సినిమా చేస్తారు అనే టాక్ వచ్చింది.

కానీ ఇప్పుడు ఫైనల్ గా దీనిపై క్లారిటీ వచ్చేసింది. రామ్ చరణ్ తో సూపర్ హిట్ సినిమా చేయడం అయితే పక్కా అని త్వరలోనే తన బ్యానర్ లో మరో సినిమా ఉంటుంది అని దిల్ రాజు లేటెస్ట్ గా తమ్ముడు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తెలిపారు. ఆల్రెడీ ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి అని కన్ఫర్మ్ చేశారు. సో వీరి కలయికలో మరో భారీ సినిమా పడబోతుంది అని చెప్పవచ్చు.

Exit mobile version