‘జయమ్ము నిశ్చయమ్మురా’ అంటూ టాక్ షోతో వస్తున్న జగపతి బాబు

టాలీవుడ్ విలక్షణ నటుడు జగపతి బాబు ప్రస్తుతం పలు క్రేజీ చిత్రాల్లో విలన్, సైడ్ క్యారెక్టర్ పాత్రల్లో నటిస్తున్నాడు. ఇక ఆయన చేసే సినిమాల్లో ఆయన పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండేలా ఆయన చూసుకుంటారు. అయితే, జగపతి బాబు ఇప్పుడు ఓ టీవీ షోలో సందడి చేయబోతున్నాడు.

ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ప్రొడక్షన్‌లో రాబోతున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి బాబు’ అనే టాక్ షోను త్వరలో టెలికాస్ట్ చేయనున్నారు. జీ తెలుగు ఛానల్‌లో ఈ టాక్ షో టెలికాస్ట్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఇక ఇప్పటికే ఈ టాక్ షోకు సంబంధించిన ప్రోమో ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేసింది.

గతంలోనూ జగపతి బాబు పలు షోలను హోస్ట్ చేశారు. మరి ఇన్నేళ్ల తర్వాత ఆయన తిరిగి బుల్లితెరపై సందడి చేయనుండటంతో ఈసారి ఆయన నుంచి ఎలాంటి ఎంటర్‌టైన్‌మెంట్ వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Exit mobile version