మరింత ప్రామిసింగ్ గా ‘తమ్ముడు’ రిలీజ్ ట్రైలర్!

మన టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ హీరోగా దర్శకుడు శ్రీరామ్ వేణు కలయికలో చేసిన అవైటెడ్ సినిమానే “తమ్ముడు”. ఫ్యాన్స్ ఎప్పుడు నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ చిత్రం ఈ శుక్రవారం థియేటర్స్ లో సందడి చేసేందుకు సిద్ధం కాగా ఈ లోపే మేకర్స్ రిలీజ్ ట్రైలర్ గా మరొకటి వదిలారు. అయితే ఈ ట్రైలర్ మాత్రం మరింత ప్రామిసింగ్ గా ఉందని చెప్పాలి.

ఇంటెన్స్ ఎమోషన్స్ సహా యాక్షన్ ఎలిమెంట్స్ తో ట్రైలర్ అదిరింది. తన అక్క కోసం ఎంత దూరమైనా వెళ్లగలిగే తమ్మడుగా నితిన్ తన అక్క ఆపదలో ఉందని తెలిసాక ఏం చేసాడు అన్న విజువల్స్ ని సాలిడ్ గా ప్రెజెంట్ చేశారు. అలాగే విలన్ రోల్ లో అనిమల్ నటుడు సౌరబ్ సచ్ దేవా క్రూరంగా కనిపిస్తున్నాడు.

ఇక మరో మేజర్ హైలైట్ ట్రైలర్ లో అజనీష్ లోకనాథ్ ఇచ్చిన స్కోర్ అని చెప్పాలి. ఇది థియేటర్స్ లో ట్రాన్స్ లోకి తీసుకెళ్తుంది అనిపిస్తుంది. ఇలా మొత్తానికి మాత్రం ఒక ప్రామిసింగ్ రిలీజ్ ట్రైలర్ తో మేకర్స్ ట్రీట్ ఇచ్చారని చెప్పొచ్చు. ఇక దిల్ రాజు బ్యానర్ లో నిర్మాణం వహించిన ఈ చిత్రం జూలై 4న గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Exit mobile version