‘తమ్ముడు’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..?

హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘తమ్ముడు’ జూలై 4న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాను దర్శకుడు శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేస్తుండగా పూర్తి యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా ఈ చిత్రం ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ పార్ట్నర్ కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను తొలుత అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్నట్లు తెలిసింది. కానీ, కొన్ని కారణాల వల్ల ఈ రైట్స్ ను ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. భారీ రేటుకు ఈ చిత్ర ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. దీంతో ఈ చిత్ర థియేట్రికల్ రన్ తర్వాత ‘తమ్ముడు’ నెట్‌ఫ్లిక్స్‌లో సందడి చేయబోతున్నాడు.

ఇక ఈ సినిమాలో లయ, సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు, శిరీష్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Exit mobile version