ఫోటో మూమెంట్: తలైవర్ కి ‘మిరాయ్’ ట్రైలర్ చూపించిన మంచు హీరో!

ఫోటో మూమెంట్: తలైవర్ కి ‘మిరాయ్’ ట్రైలర్ చూపించిన మంచు హీరో!

Published on Sep 2, 2025 11:03 AM IST

ఈ సెప్టెంబర్ లో రిలీజ్ కి రాబోతున్న పలు అవైటెడ్ చిత్రాల్లో మన టాలీవుడ్ నుంచి కూడా భారీ సినిమాలు ఉన్నాయి. మరి ఆ చిత్రాల్లో యంగ్ హీరోస్ తేజ సజ్జ, మంచు మనోజ్ లు హీరో విలన్స్ గా నటించిన చిత్రం “మిరాయ్” కూడా ఒకటి. టాలెంటెడ్ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ భారీ చిత్రం నుంచి ఇటీవల వచ్చిన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

అయితే ఈ ట్రైలర్ ని తలైవర్ సూపర్ స్టార్ రజినీకాంత్ కి చూపించినట్టుగా మంచు మనోజ్ కొన్ని ఫోటోలు షేర్ చేసుకున్నాడు. దీనితో ఈ స్పెషల్ మూమెంట్ వైరల్ గా మారింది. మరి ఇందులో రజినీకాంత్ సీరియస్ గా ఈ ట్రైలర్ చూస్తుంటే మనోజ్ పక్కనే నవ్వుతూ కనిపిస్తున్నాడు. దీనితో తమ ట్రైలర్ చూసినందుకు మనోజ్ ఆనందం వ్యక్తం చేస్తూ ఇపుడు రాబోతున్న శివ కార్తికేయన్ మదరాసి సినిమాకి ఆల్ ది బెస్ట్ తెలిపాడు.

తాజా వార్తలు