‘ఓజి’ కొత్త పోస్టర్.. రక్తపాతం తర్వాత కూల్ స్వాగ్ తో సేద తీరుతున్న పవర్ స్టార్!

‘ఓజి’ కొత్త పోస్టర్.. రక్తపాతం తర్వాత కూల్ స్వాగ్ తో సేద తీరుతున్న పవర్ స్టార్!

Published on Sep 2, 2025 10:06 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆల్రెడీ తెలుగు స్టేట్స్ సహా సోషల్ మీడియాలో కూడా సెలబ్రేషన్స్ సాగుతున్నాయి. ఇక తన నుంచి వస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో దర్శకుడు సుజీత్ తో చేస్తున్న భారీ చిత్రం “ఓజి” నుంచి నేడు సాయంత్రం ఓ బిగ్ ట్రీట్ ని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. కానీ దీనికి ముందే ఓ పోస్టర్ కూడా వస్తుంది అని టాక్ వచ్చింది.

దీనితో ‘ఓజి’ మేకర్స్ ఇపుడు ఆ స్పెషల్ పోస్టర్ ని పవన్ బర్త్ డే కానుకగా ఫ్యాన్స్ కి అందించారు. మరి ఈ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ సూపర్ కూల్ గా కనిపించారని చెప్పాలి. వింటేజ్ డాడ్జ్ కార్ మీద కూర్చున్న స్టైలిష్ ఓజి ఓ వైపు కార్ కింద గమనిస్తే రక్తపాతం కనిపిస్తుంది. ఇలా రక్తపాతం తర్వాత సేద తీరుతూ కనిపించిన ఈ క్రేజీ పోస్టర్ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చింది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణం వహించారు.

తాజా వార్తలు