లేటెస్ట్ గా సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కూలీ సినిమా తర్వాత తన కెరీర్ 173 వ సినిమా దర్శకుడు సుందర్ సి తో అనౌన్స్ అయ్యిన సంగతి అందరికీ తెలిసిందే. ఆండవర్ కమల్ హాసన్ నిర్మాణ సారథ్యంలో ఈ సినిమా తెరకెక్కబోతుంది.
మరి మేకర్స్ నిన్ననే ఈ గ్రాండ్ అప్డేట్ అందించగా లేటెస్ట్ గా తలైవర్, ఆండవర్ ల పిక్ వారి తాలూకా బాండ్ ని చూపించే విధంగా అభిమానుల్లో మరింత ఆనందాన్ని నింపింది. ఇద్దరు దిగ్గజాలు తమ సినిమా కోసం బెస్ట్ విషెస్ చెప్పుకుంటూ కరచాలనం చేస్తున్న ఈ పిక్ మంచి ఫోటో మూమెంట్ గా మారింది.
మరి ఈ క్రేజీ కాంబినేషన్ లో సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ సినిమాని మేకర్స్ 2027 సంక్రాంతి కానుకగా రిలీజ్ కి తీసుకొస్తున్నారు.
The Bond Beyond #Thalaivar173 #Pongal2027@rajinikanth @ikamalhaasan #SundarC #Mahendran @RKFI @turmericmediaTM @magizhmandram pic.twitter.com/dwKmlzcVnX
— Raaj Kamal Films International (@RKFI) November 6, 2025
