అదిరిపోయే కలెక్షన్స్ తో ఫైనాన్స్ క్లియర్ చేస్తున్న కమల్

అదిరిపోయే కలెక్షన్స్ తో ఫైనాన్స్ క్లియర్ చేస్తున్న కమల్

Published on Feb 11, 2013 4:42 PM IST

Vishwaroopam

కొన్ని రోజుల క్రితం జరిగిన ప్రెస్ మీట్లో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ తను తీసిన ‘విశ్వరూపం’ సినిమా కోసం తన ఆస్తులన్నీ పెట్టి ఫైనాన్స్ తీసుకున్నానని చెప్పారు. అతను ఈ సినిమాకోసం తన ఆస్తులను సుమారు 67 కోట్లకి తనఖా పెట్టారు. ఇక్కడ శుభవార్త ఏమిటంటే అందులో 57 కోట్లను ఇప్పటికే తిరిగి కట్టేశారు, ఇంకా 10 కోట్లు మాత్రమే మిగిలి ఉంది, అదికూడా ఫిబ్రవరి 15 లోపు చెల్లించేస్తారని అంచనా వేస్తున్నారు. తమిళనాడులో ‘విశ్వరూపం’ సినిమాకి అదిరిపోయే రెవిన్యూ రావడం కమల్ కి బాగా సాయపడింది, అంతే కాకుండా సినిమా అక్కడ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

‘విశ్వరూపం’ బాన్ సమయంలో కమల్ హాసన్ యొక్క సాహసోపేత నిర్ణయాలకి తన ఫాన్స్, పౌరులు అతనికి అండగా నిలిచారు. ఈ సినిమాకి సంబందించిన ఫైనాన్సియర్స్ కి కమల్ డబ్బు తిరిగి ఇవ్వడంతో వాళ్ళు సంతోషంగా ఉన్నారు. కమల్ డబ్బులు పోవాలని ఎవరు మాత్రం అనుకుంటారు?

తాజా వార్తలు