లక్ష్మీ మంచు పేరు పై పెర్ఫ్యూమ్స్?

లక్ష్మీ మంచు పేరు పై పెర్ఫ్యూమ్స్?

Published on Nov 21, 2012 4:12 PM IST


డా. మోహన్ బాబు వారసురాలు గానే కాకుండా తన విలక్షణ నటనతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం త్వరలోనే లక్ష్మీ మంచు తన పేరు మీద ఒక సొంత బ్రాండ్ ప్రారంభించి, ఆ బ్రాండ్ నుంచి పెర్ఫ్యూమ్స్ మరియు డియోడరెంట్స్ లాంటి ప్రొడక్ట్స్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయం పై క్రిస్టమస్ లోపు అధికారిక ప్రకటన చేయనున్నారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇలా జరగడం ఇదే మొదటి సారి కానీ హాలీవుడ్ మరియు బాలీవుడ్ కి మాత్రం కొత్తేమీ కాదు. లక్ష్మీ మంచు ప్రధాన పాత్రలో పోషించి మరియు నిర్మించిన ‘గుండెల్లో గోదారి’ సినిమాని డిసెంబర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తాజా వార్తలు