ప్రేక్షకులు నన్ను అంత తొందరగా మర్చిపోరు

ప్రేక్షకులు నన్ను అంత తొందరగా మర్చిపోరు

Published on Oct 8, 2012 8:27 AM IST

మొన్నటి వరకు సౌత్ ఇండియాలో టాప్ హీరొయిన్ గా ఏలిన త్రిషా చేతిలో ప్రస్తుతం తెలుగు ప్రాజెక్టులు ఏమీ లేవు. దీని గురించి ఆమె ఏమీ బాధ పడట్లేదు. మంచి పాత్రలు ఉంటే తన దాకా తప్పకుండ వస్తాయని ఆమె అంటోంది. ‘తెలుగు ప్రేక్షకులు నన్ను ఎప్పుడైనా ఆదరిస్తారు. తెలుగు ప్రేక్షకులు నన్ను మర్చిపోలేని స్థాయిలో ఉండే పాత్రలు ఎన్నో నేను తెలుగులో చేసాను. ప్రస్తుతం నా చేతిలో తెలుగు ప్రాజెక్టులు ఏమీ లేవు కాని త్వరలో ఒక మంచి పాత్రతో మీ ముందుకు వస్తాను. త్రిషా తెలుగులో నటించిన చివరి సినిమా దమ్ము. ప్రస్తుతం ఈ అమ్మడు మూడు తమిళ సినిమాలతో బిజీగా ఉంది. విశాల సరసన సమర్ అనే సినిమాలో నటిస్తుంది. దాదాపు షూటింగ్ పూర్తి కావచ్చిన ఈ సినిమా తెలుగులో కూడా డబ్ అయ్యే అవకాశం ఉంది.

తాజా వార్తలు