అన్ స్టాపబుల్ ‘చికిరి చికిరి’ అప్పుడే 60 మిలియన్లు

అన్ స్టాపబుల్ ‘చికిరి చికిరి’ అప్పుడే 60 మిలియన్లు

Published on Nov 11, 2025 1:11 PM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న సాలిడ్ రూరల్ స్పోర్ట్స్ డ్రామానే “పెద్ది”. అభిమానులు మంచి ఎగ్జైటెడ్ గా ఈ ఒక్క సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న అభిమానులకి రీసెంట్ గానే సూపర్ హిట్ సాంగ్ ని సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ అందించిన సంగతి తెలిసిందే. మరి ఈ సాంగ్ వేవ్ మాములుగా లేదని చెప్పాలి.

ఆల్రెడీ రీల్స్ లో ట్రెండింగ్ లో ఉండగా మొత్తం యూట్యూబ్ లో ఇపుడు ఏకంగా 60 మిలియన్ వ్యూస్ ని ఈ సాంగ్ ఈ కొద్ది సమయంలోనే అందుకుంది. ఇలా బిగ్ చార్ట్ బస్టర్ దిశగా ఈ సాంగ్ ఇప్పుడు వెళుతుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో శివ రాజ్ కుమార్ తదితరులు కీలక పాత్రలు చేస్తుండగా వృద్ధి సినిమాస్ నిర్మాణం వహిస్తున్నారు. అలాగే వచ్చే ఏడాది మార్చ్ 27న భారీ లెవెల్లో పాన్ ఇండియా భాషల్లో ఈ సినిమాని విడుదల చేస్తున్నారు.

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

తాజా వార్తలు