స్లో అండ్ స్టడీగా ‘ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో’ వసూళ్లు

స్లో అండ్ స్టడీగా ‘ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో’ వసూళ్లు

Published on Nov 11, 2025 2:07 AM IST

Pre-wedding-show

‘మసూద’తో గుర్తింపు పొందిన నటుడు తిరువీర్ తాజా చిత్రం ‘ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో’ ఇటీవల రిలీజ్ అయి థియేటర్లలో సందడి చేస్తోంది. రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ కామెడీ డ్రామాకు విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు లభించాయి. ‘కమిటీ కుర్రోళ్లు’ ఫేమ్‌ టీనా శ్రావ్య హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి కూడా మంచి స్పందన లభిస్తోంది.

ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ వీకెండ్‌లో రూ. 2.22 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ సక్సెస్‌తో ఉత్సాహం పొందిన డిస్ట్రిబ్యూటర్లు వచ్చే వారంలో స్క్రీనింగ్‌లను పెంచేందుకు సిద్ధమవుతున్నారు.

ఈ సినిమా మరింత మంది ప్రేక్షకులకు చేరాలంటే సెలెబ్రిటీలతో ప్రమోట్ చేయిస్తే బాగుంటుందని పలువురు కామెంట్ చేస్తున్నారు. ఈ సినిమాలో రోహన్ రాయ్, నరేంద్ర రవి, యామిని నాగేశ్వర్ ఇతర కీలక పాత్రల్లో నటించారు.

తాజా వార్తలు