2026 సంక్రాంతికి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ‘ది రాజాసాబ్’ గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ చిత్రాన్ని జనవరి 9న థియేటర్లలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. అయితే, ఈ చిత్ర షూటింగ్ ఇంకా పూర్తికాలేదని, రీషూట్లు జరుగుతున్నాయనే వార్తలు వినిపిస్తుండటంతో ఈ సినిమా పండగకు వస్తుందో లేదో అని అందరూ ఆందోళన చెందుతున్నారు.
ఈ వార్తలతో గందరగోళం నెలకొనడంతో దీనిపై మరోసారి క్లారిటీ ఇచ్చాడు నిర్మాత ఎస్‌కెఎన్. ‘‘పండగకు వస్తున్నాం.. పండగ చేస్తు్న్నాం’’ అని ఆయన ట్వీట్ చేయడంతో రాజా సాబ్ వాయిదా పడే అవకాశం లేదని తేలిపోయింది. దీంతో అభిమానులు సోషల్ మీడియాలో సంబరాలు మొదలుపెట్టారు.
నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ మంచి హైప్ తెచ్చింది. సంక్రాంతి రేసులో రాజా సాబ్ ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.


