గ్లోబ్ ట్రాటర్’ నే ఫిక్స్ చేసారా?

గ్లోబ్ ట్రాటర్’ నే ఫిక్స్ చేసారా?

Published on Nov 11, 2025 7:00 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తన 29వ సినిమాని దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్లో చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. భారీ అంచనాలతో తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ సినిమా ఈ సినిమా నుంచి ఆకస్మికంగా మొదటి సాంగ్ రావడం సర్ప్రైజింగ్ గా మారింది.

ఇక ఈ సినిమా టైటిల్ పై కూడా దీనితోనే ఓ క్లారిటీ కూడా వచ్చినట్టే అనుకోవాలా అనిపిస్తుంది. ఇది వరకు వారాణసి అనే టైటిల్ వినిపించింది కానీ దానిని మరో సినిమా యూనిట్ పెట్టేసుకున్నారు. అయితే ఈ సినిమాకి గ్లోబల్ రీచ్ టైటిల్ కోసం ఫ్యాన్స్ చూస్తున్నారు. ఇలా ఇది వరకే ఈ సినిమాను ప్రొజెక్ట్ చేస్తున్న గ్లోబ్ ట్రాటర్ కి మంచి రెస్పాన్స్ ఉంది. ఇక లేటెస్ట్ సాంగ్ తో కూడా ఇదే టైటిల్ ని ప్రస్తావించారు. సో ఈ సినిమా టైటిల్ అదే కావడానికి అవకాశం ఉంది. మరి అఫీషియల్ టైటిల్ ఏంటి అనేది ఈ 15న ఒక క్లారిటీ వస్తుంది.

తాజా వార్తలు