రెహమాన్ డప్పు.. రామ్ చరణ్ స్టెప్పు.. బ్లాస్ట్‌ను రెడీ చేస్తున్న ‘పెద్ది’

రెహమాన్ డప్పు.. రామ్ చరణ్ స్టెప్పు.. బ్లాస్ట్‌ను రెడీ చేస్తున్న ‘పెద్ది’

Published on Aug 27, 2025 4:52 PM IST

Peddi

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘పెద్ది’ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దర్శకుడు బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే, ఇటీవల టాలీవుడ్‌లో సినీ కార్మికుల సమ్మె కారణంగా ఈ చిత్ర షూటింగ్‌కు కొంత బ్రేక్ వచ్చింది.

ఇక నేడు(ఆగస్టు 27) వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ చిత్ర యూనిట్ ఓ సాలిడ్ అప్డేట్ అయితే ఇచ్చారు. ఈ సినిమాలోని ఓ మాసివ్ సాంగ్ షూటింగ్ నేడు ప్రారంభిస్తున్నట్లు చిత్ర యూనిట్ ఓ వీడియో రూపంలో తెలిపింది. ఈ పాట సినిమాకే హైలైట్ కానుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ పాట కోసం ఏఆర్ రెహమాన్ అదిరిపోయే మాస్ బీట్స్ అందించినట్లు చిత్ర యూనిట్ చెబుతుంది.

ఈ పాటలో.. ‘‘రెహమాన్ గారి డప్పు.. రామ్ చరణ్ గారి స్టెప్పు.. కలగలిసి.. ఇది మెగా పవర్ స్టార్ బ్లాస్ట్’’ అవుతుందని దర్శకుడు బుచ్చిబాబు సానా ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో అందాల భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ ప్రెస్టీజియస్ చిత్రాన్ని మార్చి 27, 2026 లో గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

తాజా వార్తలు