పెట్ డాగ్ తో హెడ్ మస్సాజ్ చేయించుకుంటున్న పాయల్

పెట్ డాగ్ తో హెడ్ మస్సాజ్ చేయించుకుంటున్న పాయల్

Published on May 17, 2020 9:30 PM IST


లాక్ డౌన్ పీరియడ్ లో హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ తన ఇంటిలో ఆహ్లాదంగా గడుపుతున్నారు. ఇష్టం వచ్చిన వ్యాపకలతో లాక్ డౌన్ సమయాన్ని గడుపుతున్న పాయల్ రైటర్ పేరుతో ఓ షార్ట్ ఫిల్మ్ కూడా తీశారు. తాగుబోతు భర్త కారణంగా ఇబ్బందిపడే ఓ మహిళా రచయిత కథగా ఆ షార్ట్ ఫిల్మ్ ఉంటుందట. కాగా పాయల్ ఇంటిలో తన పెట్ డాగ్ తో ఆడుకుంటున్న ఓ వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోతో పాటు ఎవరికైనా మస్సాజ్ కావాలా అని ఓ కామెంట్ కూడా పెట్టారు. పెట్ డాగ్ తో హెడ్ మస్సాజ్ చేయించుకుంటున్న పాయల్ సూపర్ గా ఎంజాయ్ చేస్తుంది.

మొదటిసినిమాతోనే గ్లామర్ హీరోయిన్ గా పేరుతెచ్చుకున్న పాయల్ ఆర్ డి ఎక్స్ లవ్ మూవీతో ఆ ఇమేజ్ ని మరోస్థాయికి తీసుకెళ్లింది. గత ఏడాది వెంకటేష్, నాగ చైతన్యల మల్టీస్టారర్ వెంకీ మామ సినిమాలో నటించి హిట్ అందుకుంది. ఐతే అందులో పాయల్ సెకండ్ హీరోయిన్ కావడంతో ఆ హిట్ ఆమె ఖాతలో చేరలేదు. అందం అభినయం ఉన్నా… పాయల్ నటించిన చాలా సినిమాలు ప్లాప్ కావడంతో ఆమెకు వరుసగా అవకాశాలు రావడం లేదు.

https://www.instagram.com/p/CASOyHFH4w3/?igshid=v82mqqvfjy2s

సంబంధిత సమాచారం

తాజా వార్తలు