రాంబాబు సినిమా సెన్సార్ కట్స్ అండ్ డీటైల్స్

రాంబాబు సినిమా సెన్సార్ కట్స్ అండ్ డీటైల్స్

Published on Oct 12, 2012 2:55 AM IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెమెరామెన్ గంగతో రాంబాబు ఈ రోజు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్ అందించారు. ఈ చిత్ర కట్స్ వివరాల్లోకి వెళ్తే విజువల్ కట్స్ ఏమి లేనప్పటికీ డైలాగ్స్ విషయంలో మాత్రం రెండు చోట్ల అభ్యంతరం చెప్పారు. ఒక చోట తమన్నా చెప్పిన గు… పగులుతుంది అన్న డైలాగ్ కి మరియు ప్రకాష్ రాజ్ ఇంట్రడక్షన్ సన్నివేశంలో వోట్ల కోసం సంక నాకాలి అని చెప్పిన డైలాగ్ కి కట్ చెప్పారు. ఈ రెండు డైలాగ్స్ కి కట్స్ చెప్పిన సెన్సార్ టీం ఈ సినిమా చూసి మెచ్చుకున్నట్లు చిత్ర యూనిట్ సభ్యుల సమాచారం.

తాజా వార్తలు