సెన్సార్ పూర్తి చేసుకున్న కెమెరామెన్ గంగతో రాంబాబు

సెన్సార్ పూర్తి చేసుకున్న కెమెరామెన్ గంగతో రాంబాబు

Published on Oct 11, 2012 4:30 PM IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమా ఈ రోజు సెన్సార్ కార్యక్రమాలు జరుపుకొంది. ఈ చిత్రానికి సెన్సార్ వారు యు/ఎ సర్టిఫికేట్ ఇచ్చారు. అలాగే ఈ సినిమాలో ఎలాంటి కట్స్ కూడా లేవు. సెన్సార్ కూడా అయిపోవడంతో ఈ చిత్రం భారీ ఎత్తున అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమైపోతోంది.

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మిల్క్ బ్యూటీ తమన్నా కథానాయికగా నటించారు. స్వరబ్రహ్మ మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ టీవీ రిపోర్టర్ గా పనిచేయనున్నారు. డి.వి.వి దానయ్య నిర్మించిన ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ విలన్ పాత్ర పోషించారు. నిర్మాత దానయ్యకి మరియు పవన్ అభిమానులకు ఈ చిత్రంపై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి.

తాజా వార్తలు