పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘అత్తారింటికి దారేది’ సినిమా ఈ శుక్రవారం భారీ ఎత్తున విడుదల కానుంది. ఈ సినిమాకి సంబందించిన ఓవర్సీస్ ప్రింట్స్ ఈ రోజు రాత్రికి 9:40 నిమిషాలకు అమెరికా వెళ్లనున్న ఎమిరేట్స్ ఫ్లైట్ లో వెళ్లనున్నాయి. మొత్తం 3 సాధారణ ప్రింట్స్, 85 డిజిటల్ ప్రింట్స్ ఈ రోజు రాత్రి వెళ్లనున్నాయి.
యుఎస్ లో ప్రీమియర్ షౌస్ వేయనున్నారు. దానికి సంబందించిన వివరాలు మాకు తెలియాల్సి ఉంది మాకు తెలియగానే మీకు అందజేస్తాము. ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చేస్తున్నవారు ప్రీమియర్ షోస్ గురించి అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ అడిగి తెలుసుకోవచ్చు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ – పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వస్తున్నా ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. సమంత, ప్రణిత హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేసాడు. బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్ర నిర్మాత.