ఇన్ ఆర్బిట్ మాల్ దగ్గర సందడి చేస్తున్న పవన్ కళ్యాణ్

ఇన్ ఆర్బిట్ మాల్ దగ్గర సందడి చేస్తున్న పవన్ కళ్యాణ్

Published on May 28, 2013 4:30 PM IST

pawan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న’అత్తారింటికి దారేది’ సినిమా షూటింగ్ హైదరాబాద్లోని ఇన్ ఆర్బిట్ మాల్ దగ్గర జరుగుతోంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ హోండా సిబిఆర్ 250 పై కనిపించారు. చాలా స్టైలిష్ గా ఉన్నాడు. ఈ సినిమా ఆగష్టులో విడుదలకావడానికి సిద్దమవుతోంది. ఈ సినిమా నిర్వాహకులు యూరప్ షెడ్యూల్ లో బాగంగా స్పెయిన్ లో 25 రోజులు పాటు షూటింగ్ నిర్వహించడానికి త్వరలో వెళ్లనున్నారు. ఈ సమంత, ప్రణిత హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర చాలా ఇంటరెస్టింగ్ గా ఉండనుందని సమాచారం. త్రివిక్రమ్ సినిమాలలో ఉండే కామెడీ, మంచి క్వాలిటితో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. బోమన్ ఇరానీ, నదియా ఈ సినిమాలో ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు.

తాజా వార్తలు