అమెరికాలో అదిరిపోయే కలక్షన్ల నడుమ అత్తారింటికి దారేది

అమెరికాలో అదిరిపోయే కలక్షన్ల నడుమ అత్తారింటికి దారేది

Published on Sep 28, 2013 10:00 PM IST

Attarintiki-Daredi

బాక్స్ ఆఫీస్ దగ్గర విశ్లేషకులు, ట్రేడ్ పండితులు రికార్డు పుస్తకాల గుణాంకాలను మార్చీ సమయం ఆసన్నమైంది. ఎందుకంటే అత్తారింటికి దారేది సినిమా అన్ని రికార్డులను అధిగమిస్తుంది. ముఖ్యంగా అమెరికాలో ఈ సినిమా సృష్టిస్తున్న ప్రభంజనం అంతా ఇంతా కాదు. అక్కడ విడుదలైన అన్ని తెలుగు సినిమాలకు సంబంధించిన అన్ని రికార్డులను తుడిచిపెట్టేస్తుంది

రెండో రోజే ఈ అమెరికాలో దాదాపు 1మిలియన్ మార్క్ ను అందుకుంది. ప్రముఖ ట్రేడ్ పండితుడు తరణ్ ఆదర్శ్ లెక్కల ప్రకారం 924000 డాలర్లను కేవలం రెండు రోజుల్లో సంపాదించింది. ఇదే జోరు కొనసాగితే అక్కడ 2 మిలియన్ల మార్కును ఈజీగా అందుకుంటుంది అని తెలిపారు

ఈ సినిమాకు త్రివిక్రమ్ దర్శకుడు. బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మాత. పవన్ సరసన సమంత నటించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు