పవన్ కి ఆ స్టార్ దర్శకుడు కావాలట.!

పవన్ కి ఆ స్టార్ దర్శకుడు కావాలట.!

Published on Mar 8, 2020 4:32 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా మూడు సినిమాలు ప్రకటించారు. వాటిలో రెండు సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. దర్శకుడు శ్రీరామ్ వేణు తెరకెక్కిస్తున్న వకీల్ సాబ్ మూవీ షూటింగ్ చివరి దశకు చేరింది. మే నెలలో ఈ చిత్రం విడుదల కానుంది. ఇక దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న పీరియాడిక్ మూవీ కూడా షూటింగ్ దశలో ఉంది. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ బందిపోటు పాత్ర చేస్తున్నారు.

ఇక హరీష్ శంకర్ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఐతే పవన్ దర్శకుడు త్రివిక్రమ్ తో చేయాలని భావిస్తున్నాడట. ఈ మూడు చిత్రాల అనంతరం త్రివిక్రంతో మూవీ చేయాలని ఆశపడుతున్న ఆయన, స్క్రిప్ట్ సిద్ధం చేయమని కూడా చెప్పడం జరిగిందట. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో మూడు చిత్రాలు వచ్చాయి. వాటిలో అత్తారింటికి దారేది బ్లాక్ బస్టర్ హిట్ కాగా అజ్ఞాతవాసి పరాజయం పొందింది.

తాజా వార్తలు