రాడిస్సన్ హోటల్ దగ్గర ‘అత్తారింటికి దారేది’ షూటింగ్

రాడిస్సన్ హోటల్ దగ్గర ‘అత్తారింటికి దారేది’ షూటింగ్

Published on May 27, 2013 4:42 PM IST

Pawan-and-Tri-Vikram1
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘అత్తారింటికి దారేది’. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ బంజారా హిల్స్ లోని రాడిస్సన్ హోటల్ దగ్గర జరుగుతోంది. ఈ షూటింగ్ లో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సమంత, ప్రణిత హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాని ఆగస్ట్ 7న విడుదల చేయడానికి పవన్, త్రివిక్రమ్ చాలా చురుకుగా పనిచేస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోందని సమాచారం.

తాజా వార్తలు